- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదలకు గుడ్ న్యూస్.. ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం కీలక ప్రకటన
by Vemula.Srinu Prasad |
పేదలకు ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది...

X
దిశ, వెబ్ డెస్క్: పేదలకు ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు ప్రతి మూడు నెలలకోసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టేందుకు రెడీ అయింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఇళ్ల నిర్మాణాలు, లబ్ధిదారుల ఎంపికపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడేళ్లలో పేదలకు 17 లక్షల ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం నిలిచిపోయిన ఎన్టీఆర్ గృహాలకు సంబంధించిన నిధులను రాబట్టేందుకే కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
Next Story






