- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాపు ఉద్యమకారులకు బిగ్ షాక్.. ఆ కేసులపై అప్పీల్‌కు వెళ్లనున్న ప్రభుత్వం
by Vemula.Srinu Prasad |
కాపు ఉద్యమకారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది...

X
దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమకారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం కొట్టివేసిన కేసులుపై మళ్లీ విచారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టులో అప్పీల్ చేయాలని పీపీని ఆదేశించింది. దీంతో హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. కాపు ఉద్యమంలో భాగంగా అప్పటి నేత ముద్రగడ పద్మనాభం రైలు రోకో నిర్వహించారు. అయితే ఈ నిరసనలో కొన్ని ఆస్తులు ధ్వంసం అయ్యాయి. దీంతో పద్మనాభంతో పాటు పలువురిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులను విజయవాడ రైల్వే కోర్టు(Vijayawada Railway Court) కొట్టివేసింది. దీంతో కాపు ఉద్యమకారులపై ఉన్న కేసులను గత ప్రభుత్వం కొట్టివేసింది. ఇప్పుడు ఈ కేసులపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Next Story






