- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై సాయంత్రంకల్లా నగదు జమ
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం అత్యంత విజయవంతంగా నిర్వహిస్తోంది. ఖరీఫ్ సీజన్ కొనుగోళ్లు ప్రస్తుతం చివరి దశకు చేరాయి. 2025-2026 ఖరీఫ్ మాసంలో ఇప్పటివరకు కొనుగోళ్లు జరిగాయి. ఈ ధాన్యానికి సంబంధించిన చెల్లింపుల్లో 94 శాతం నగదు 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఇకపై ఉదయం ధాన్యం కొనుగోలు జరిగితే అదే రోజు సాయంత్రం రైతు ఖాతాలో నగదు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటోంది. తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు తదితర జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఎదురైన లోపాలను సమీక్షించి, రాబోయే రబీ సీజన్‌కు పూర్తిస్థాయిలో కొనుగోళ్లకు అధికార యంత్రాగాన్ని సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో తిరుపతిలో రబీ సీజన్‌కు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది. క్షేత్రస్థాయిలో ఆర్ఎస్కేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే విధంగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటివరకు...
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,83,623 మంది రైతుల నుంచి 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. 24 గంటల్లోనే రూ.9800 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. రైతులు ఇబ్బందులు పడకుండా తొలిసారిగా ప్రత్యేక రైలు సదుపాయం కల్పించి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలింపు చేపట్టింది. రైతులకు అవసరమైన గన్ని బ్యాగులు, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ సదుపాయాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు అంచనాలు సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అధికారులతో సమీక్షించిన ఆయన ఇకపై ధాన్యం కొనుగోలు జరిగిన రోజే చెల్లింపు చేస్తామని హామీ ఇచ్చారు.






