- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో డ్రైవర్లకు మరో గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది..

దిశ, వెబ్ డెస్క్: ఆటో డ్రైవర్ల(Auto Drivers)కు ప్రభుత్వం(Government) మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఆటో డ్రైవర్లకు ఈ రోజు రూ. 15 వేలు పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం ఒక యాప్ తయారు చేసి బుకింగ్ లు వచ్చేలా చేస్తామని తెలిపారు. ఆటో స్టాండుకు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా సహకారం అందిస్తామన చెప్పారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల భవిష్యత్తు కోసం పని చేస్తామని భరోసా ఇచ్చారు.
అలాగే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా అవకాశాలు దొరికేలా చేస్తామని, ఆటో, మాక్సి క్యాబ్, క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడలో 90 శాతం వాహనాలు సీఎన్జీ ఇంధనంతోనే నడుస్తున్నాయన్నారు. వచ్చే రోజుల్లో అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. గతంలో పెద్ద ఎత్తున జరిమానాలు విధించేవారని, జరిమానాలు భారం కాకుండా చూస్తామన్నారు. ఆటో, మాక్సి, క్యాబ్ డ్రైవర్లు క్రమశిక్షణగా ఉండాలని సూచించారు. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించవద్దని... ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉంటాయని తెలిపారు. క్రమశిక్షణగా ఉండి, ప్రజలకు సౌకర్యం కల్పించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.






