- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యం : మంత్రి ఆనం
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన డీడీఓ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ప్రారంభోత్సవానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. అధికారులు, కూటమి పార్టీల శ్రేణులతో కలిసి ఆత్మకూరులో ఏర్పాటు చేసిన డీడీఓ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ప్రకటించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 251 మంది లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పట్టాలను మంజూరు చేశామని మంత్రి తెలిపారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు నిధులు మంజూరు అయ్యాయి అన్నారు. పథకం కింద జిల్లాకు రూ. 70.95 కోట్లు సబ్సిడీ సహకారంతో ఏకంగా రూ. 2,838 ఇళ్లు మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం లక్ష్యం పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చడమేనని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.5 లక్షల సబ్సిడీని కూటమి ప్రభుత్వం తరపున అందిస్తున్నామని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని మంత్రి వివరించారు. దార్శనిక పాలకుడైన ముఖ్యమంత్రి పేదల పక్షాన ఎల్లప్పుడూ నిలుస్తారని స్పస్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,410 ఇండ్లు మంజూరయ్యాయి అన్నారు. లబ్ధిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొందని ప్రకటించారు. సొంతింటి కలను సాకారం చేస్తూ వారి కలల్లో ఆనందాలను చూడడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని మంత్రి తెలిపారు. అందుకు గానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలను తెలియజేశారు.






