- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి లోకేశ్ సార్.. మాకు అన్నం పెట్టడంలేదు: విద్యార్థినుల తీవ్ర ఆవేదన
స్కూళ్లు, హాస్టళ్లను అభివృద్ధి చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యఅందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది....

దిశ, వెబ్ డెస్క్: స్కూళ్లు(School), హాస్టళ్ల(Hostels)ను అభివృద్ధి చేసి విద్యార్థుల(Students)కు నాణ్యమైన విద్య(Education) అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ చోట్ల ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ విషయం ఎవరో చెప్పడం కాదు.. విద్యార్థినులే చెబుతున్నారు. తమ హాస్టల్‌లో జరుగుతున్న నిర్వాకాన్ని అనకాపల్లి జిల్లా(Anakapalli District) చీడికాడ బీసీ బాలిక వసతి గృహం బాలికలు(Cheedikada BC Girls Hostel Girls) ఎక్స్ వేదికగా బయటపెట్టారు. తమ హాస్టల్‌లో తమకు అన్నం సరిగాపెట్టడంలేదని, సగం ఆకలితో పస్తులుంటున్నామని మంత్రి నారా లోకేశ్‌కు మొర పెట్టుకున్నారు. మంత్రి లోకేశ్ సార్ అంటూ ‘‘ హాస్టల్‌లో అన్నం సరిగా పెట్టడంలేదు. స్కూలులో పెడుతున్నారు కధా మళ్లీ ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు. గుడ్లు, స్వీట్స్ మాకు పెట్టడం లేదు. ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి పది తర్వాత హాస్టల్ బియ్యాన్ని అమ్ముతున్నారు. విద్యార్థులను అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. బాత్ రూములు కూడా మేమే కడుగుతున్నాం. మా అవస్థలను పట్టించుకోండి.’’ అని వీడియో ద్వారా తెలిపారు.






