- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్న కూతురిపై తండ్రి కర్కశత్వం.. కనికరం లేకుండా!?
రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా, అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన కన్న కూతురి పట్ల ఓ తండ్రి దారుణంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలో ఓ కసాయి తండ్రి కన్న బిడ్డ పై కర్కశత్వం ప్రదర్శించాడు. ఆ మూడేళ్ల చిన్నారి హాస్టల్‌లో ఎక్కడపడితే అక్కడ మూత్రవిసర్జన చేస్తుందంటూ చిన్నారిని చితకబాదాడు.
జిల్లాలోని ఓ బాయ్స్ హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేసే శివ తన మూడేళ్ల చిన్నారిపై గొంతు నులుముతూ కనికరం లేకుండా దాడి చేశాడు. సరిగ్గా మాటలు కూడా రాని ఆ పసికందును నిర్దాక్షిణ్యంగా చావబాదాడు. ఈ ఘటన విజయవాడ నగరంలోని జేఎన్టీయూ కళాశాల సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనను పక్కన ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Next Story






