- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్యసాయి బాబాతో ఆ అనుభూతి ఇంకా నా హృదయంలో నిలిచిపోయింది: సచిన్ టెండూల్కర్
ఈ రోజు శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సహా దేశంలోని ప్రముఖులు ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సహా దేశంలోని ప్రముఖులు ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా భారత క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి తో తనకున్న చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. “5వ తరగతి చదివే రోజుల్లో తన జుట్టు కూడా సాయిబాబా జుట్టులానే ఉందని ఫ్రెండ్స్ చెప్పేవారు. అందుకే ఎన్నోసార్లు హెయిర్‌కట్ చేయించుకోవడానికి కూడా ఇష్టపడేవాన్ని కాదు” అని చెప్పుకొచ్చారు.
బాబాతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న లిటిల్ మాస్టర్
90వ దశకంలో మొదటిసారి సత్యసాయిబాబా ను కలిసిన సందర్భాన్ని కూడా సచిన్ గుర్తు చేసుకున్నారు. “నా మనసులో ఉన్న ప్రశ్నలకు అడగకుండానే బాబా సమాధానాలు చెప్పేవారు. ఆ అనుభూతి ఇంకా నా హృదయంలో నిలిచి పోయింది” అని తెలిపారు. బాబాతో ఉన్న ఆత్మీయ అనుబంధం తన జీవితంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని సచిన్ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.






