- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధాని అమరావతిలో ఎన్నికలు.. నామినేషన్లు ప్రారంభం
by Vemula.Srinu Prasad |
రాష్ట్ర రాజధానిలో ఎన్నికల హడావుడి మొదలైంది....

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజధానిలో ఎన్నికల హడావుడి మొదలైంది. వెలగపూడి సచివాలయ ఉద్యోగ సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. ఉద్యోగ సంఘం కార్యవర్గ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు సభ్యుల పదవులకు ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీంతో ఎన్నికల నామినేషన్ల పర్వం బుధవారం ప్రారంభమయింది. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. అనంతరం నామినేషన్ల ఉసంహరణ ప్రక్రియ ఉంటుంది.
ఈ నెల 29తో ఉద్యోగ సంఘం కార్యవర్గం పదవీకాలం ముగియనుంది. దీంతో అదే రోజు అప్సా ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తులు చేశారు. ఎన్నికల తేదీని ఖరారు చేశారు. మొత్తం 9 కేటగిరిల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సచివాలయం, అసెంబ్లీతో కలిసి 1200 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Next Story






