తూర్పు గోదావరి జిల్లాలో ఆకస్మిక వరద.. బయటకు రాలేక స్థానికుల అవస్థలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-30 10:09:03  IST  )

తూర్పు గోదావరి జిల్లాపై తుపాను ఎఫెక్ట్ భారీగా పడింది..

తూర్పు గోదావరి జిల్లాలో ఆకస్మిక వరద.. బయటకు రాలేక స్థానికుల అవస్థలు
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాపై తుపాను ఎఫెక్ట్ భారీగా పడింది. దీంతో జిల్లా మొత్తం భారీగా వర్షాలు కురిశాయి. ఈ మేరకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. (East Godavari District) గోకవరం(Gokavaram) మండలంలో పెద్ద కాలువకు ఆకస్మిక వరద వచ్చింది. దీంతో పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో కాలనీ వాసులు బయటికి రాలేక పోతున్నారు. మరోవైపు బురద కాలువ పొంగడంతో కోరుకొండ మండలం ముంపులో చిక్కుకున్నారు. గోకవరంలో ముంపు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి పరిశీలించారు. ముంపు నీరు బయటకు వెళ్లేలా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు.

Next Story