తిరుపతిలో దళితుల ఆలయ ప్రవేశం నిరాకరణ.. విచారణ చేపట్టిన పోలీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-28 04:27:58  IST  )

తిరుపతి శ్రీనివాసమంగాపురంలోని కనకదుర్గం ఆలయంప్రవేశంపై కొద్దిరోజులుగా వివాదం కొనసాగుతోంది...

తిరుపతిలో దళితుల ఆలయ ప్రవేశం నిరాకరణ.. విచారణ చేపట్టిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి శ్రీనివాసమంగాపురం(Sinivasamangapuram)లోని కనకదుర్గ ఆలయం(Kanakadurga Temple) ప్రవేశంపై కొద్దిరోజులుగా వివాదం కొనసాగుతోంది. దళితులను ఆలయంలోకి ప్రవేశించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు, స్థానికేతరుల మధ్య పలుమార్లు వాగ్వాదం సైతం జరిగింది. దీంతో ఈ అంశం పోలీసులు దృష్టికి వెళ్లింది. ఈ మేరకు శనివారం ఉదయం ఆలయం వద్దకు పోలీసులు వెళ్లారు. ఆలయంలో జరిగిన ఘటనపై ఆరా తీస్తున్నారు. స్థానిక సీసీ టీవీ పుటేజులను పరిశీలిస్తున్నారు. వివాదంపై కనక దుర్గ ట్రస్ట్ ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. దీంతో శ్రీనివాసమంగాపురం కనకదుర్గమ్మ ఆలయం వివాదం తిరుపతిలో మరోసారి చర్చగా మారింది.

Next Story