సీఆర్డీఏలో అవినీతి కలకలం.. రాజధాని రైతుల జేఏసీ సంచలన డిమాండ్

by Vemula.Srinu Prasad |

ఏపీ రాజధానిని త్వరగా అభివృద్ధి చెందాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది....

సీఆర్డీఏలో అవినీతి కలకలం.. రాజధాని రైతుల జేఏసీ సంచలన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని(Ap Capital)ని త్వరగా అభివృద్ధి చెందాలని కూటమి ప్రభుత్వం(Kutami Government) ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రభుత్వ ఆశయాన్ని కొందరు కింది స్థాయి ఉద్యోగులు , సిబ్బంది అబాసుపాలు చేస్తున్నారు. రాజధాని పరిధిలోని భూములను గతంలో రైతుల నుంచి సీఆర్డీఏ ద్వారా సేకరించారు. మరిన్ని భూములు కావాల్సి ఉండటంతో తాజాగా కూడా భూములు సేకరించాలని నిర్ణయించారు.

అయితే ఇది కూడా సీఆర్డీఏ(Crda) అధికారుల సమక్షంలోనే జరగాల్సి ఉంది. దీంతో కొందరు కిందిస్థాయి ఉద్యోగులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని, ప్రతి విషయంలో అవినీతికి పాల్పడుతున్నారంటూ, తమకు రావాల్సిన పరిహారంలో సైతం అవకతవకలకు పాల్పడుతున్నారంటూ రైతులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఇందులో భాగంగా తుళ్లూరులో శనివారం రాజధాని రైతుల జేఏసీ(Capital Farmers JAC) సమావేశం నిర్వహించింది. సీఆర్డీఏ కిందిస్థాయి అవినీతిపై విచారించాలని డిమాండ్ చేస్తోంది. అమరావతిలో రైతుల పాత్రపై సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ కావాలని నిర్ణయించింది. ఈ భేటీలో సీర్ఢీఏ కిందస్థాయిలో జరుగుతున్న అవినీతిని సీఎం దృష్టి తీసుకెళ్తామని రైతులు హెచ్చరించారు.

Next Story