- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రానికి ఎమ్మెస్ థోనీ.. కారణం ఇదే..?
ఏపీలో క్రీడాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో క్రీడాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం(Alliance Government) దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్రంలో నేషనల్, ఇంటర్నేషనల్, మినీ స్టేడియాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అలాగే జాతీయ(National), అంతర్జాతీయ(InterNational) స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో క్రికెట్ స్పోర్ట్స్ అకాడమీ(Cricket Sports Academy)ని ఏర్పాటు చేయాలని భావించింది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ థోనీ(Former Indian team captain MS Dhoni) పేరుతో విశాఖలో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేసింది. ఎమ్మెస్ థోనీకి చెందిన ఆర్కాస్ స్పోర్స్ సంస్థతో ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. రూ.60 కోట్లతో క్రికెట్ అకాడమీ సహా అంతర్జాతీయ స్థాయి క్రీడా స్కూలును ఏర్పాటు చేయనుంది. ఇందులో 24 ఇన్ డోర్, ఔట్ డోర్ స్టేడియాలను ఏర్పాటు చేయనుంది.
రాష్ట్రానికి ఎమ్మెస్ థోనీ
ఇందులో భాగంగా రాష్ట్రానికి ఎమ్మెస్ థోనీ రానున్నారు. ఈ నెల 9న అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడును ఆయన కలవనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న క్రికెట్ అకాడమీపై చర్చించనున్నారు.
తిరుపతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్
మరోవైపు తిరుపతిలో శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో అకాడమీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే శాప్ చైర్మన్ రవినాయుడు అధ్వర్యంలో భూమి పూజ కూడా జరిగింది. ఇక ఈ నెల 9న ఈ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేయనుంది. అలాగే తిరుపతిలో స్పోర్స్ సిటీ నిర్మాణం చేయాలని కసరత్తులు చేస్తోంది.






