- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. రాష్ట్రానికి కీలక మార్గదర్శకాలు..!
2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విషయం సాధించింది. జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో మారిన పరిణామంతో రాజధానిపై రగడ రేగింది. దీంతో ఈ తప్పులు మళ్లీ తలెత్తకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర విభజనతో ఏపీ(Ap)కి రాజధాని అమరావతి(Amaravati)ని నిర్ణయిస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Government) తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తూ అసెంబ్లీలో(Assembly) అన్ని పార్టీలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్(Jagan) పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే నిరసనలు, ఉద్యమాలు, అరెస్టులు, విమర్శల మధ్య ఐదేళ్లు గడిచిపోయాయి. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విషయం సాధించింది. జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే చట్టబద్ధత కల్పించాలని అడుగులు వేసింది.
వివాదాలు తలెత్తకుండా చర్యలు
ఈ మేరకు కేంద్రం కూడా సుముఖం వ్యక్తం చేసింది. అంతేకాదు మళ్లీ ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పటిష్ట జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. చట్టపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకుంటోంది. ఇందులో భాగంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. ఈ మేరకు సీఆర్డీఏ-2014 తీర్మానాన్ని సవరించాలని స్పష్టం చేసింది. దీంతో అమరావతిని ఏపీ రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయనుంది. ఇందుకోసం శనివారం రోజున ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయనుంది. అసెంబ్లీలో ఈ విషయంపై చర్చించి సభ్యులు తీర్మానం చేయనున్నారు.






