- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంట్రాక్టు కార్మికుల ఆందోళన.. గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత
తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ముందస్తు పిలుపు మేరకు వందల సంఖ్యలో కార్మికులు గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. దీంతో పలువురు కార్మికులు పోర్టులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కాంట్రాక్టు కార్మికులు, కార్మిక సంఘాలు భారీ సంఖ్యలో పోర్టును ముట్టడికి ప్రయత్నించారు. పెండింగ్‌లో ఉన్న తమ బకాయిలను తక్షణమే చెల్లించాలని నిరసనకారులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.
పోలీసుల మోహరింపు, అడ్డుకునే యత్నం
కార్మికులు, కార్మిక సంఘాల ముట్టడి నేపథ్యంలో పోర్టు వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిరసనకారులు పోర్టులోకి చొచ్చుకుపోకుండా పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదాలు, తోపులాటలు జరుగుతున్నట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు పోర్టు వద్ద పర్యవేక్షిస్తున్నారు.






