ఏపీపీఎస్సీలో అక్రమాలు.. CID చీఫ్‌తో సిట్ ఏర్పాటు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-14 09:16:39  IST  )

ఏపీపీఎస్సీలో అక్రమాలపై దర్యాప్తునకు హైకోర్టు ఆదేశాలతో సీఐడీ చీఫ్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది...

ఏపీపీఎస్సీలో అక్రమాలు.. CID చీఫ్‌తో  సిట్ ఏర్పాటు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీపీఎస్సీ(APPSC)లో జరిగిన అక్రమాలపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్(SIT) ఏర్పాటు చేసింది. అంతేకాదు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. 27/2018 నోటిఫికేషన్ నియామకాల్లో(Notification Appointments) అక్రమాలు జరిగినట్లు ఫిబ్రవరి 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Andhra Pradesh High Court)లో రిట్ అప్పీల్, అనుబంధ పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని సూచించింది. మార్చి 16 లోపు నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఇక సిట్ విచారణకు సంబంధించి సోదాలు, ఆధారాల స్వాధీనానికి అన్ని అధికారాలను అప్పగించింది. దర్యాప్తునకు ఏ ప్రభుత్వ శాఖ నుంచైనా అధికారులను నియమించుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. దీంతో సిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఐడీ చీఫ్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్‌లో మరో సభ్యుడిగా సీఐడీ ఎస్పీ కె. చక్రవర్తి(CID SP K. Chakravarthy)ని నియమించింది. దీంతో 27/2018 నోటిఫికేషన్ నియామకాల్లో అక్రమాలపై ఈ సిట్ సభ్యులు దర్యాప్తు చేయనున్నారు.

Next Story