దేశంలోనే సెల్‌ఫోన్ల రికవరీలో ఆ జిల్లా టాప్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-28 13:28:47  IST  )

చోరీకి గురైన లేదా పొరపాటున పోగొట్టుకున్న ఫోన్లను ట్రేస్‌ చేసి, వాటిని యజమానులకు అప్పగించడంలో అనంతపురం పోలీసులు సత్తా చాటుతున్నారు.

దేశంలోనే సెల్‌ఫోన్ల రికవరీలో ఆ జిల్లా టాప్!
X

దిశ,వెబ్‌డెస్క్: చోరీకి గురైన లేదా పొరపాటున పోగొట్టుకున్న ఫోన్లను ట్రేస్‌ చేసి, వాటిని యజమానులకు అప్పగించడంలో అనంతపురం పోలీసులు సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ల రికవరీలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని అనంతపురం జిల్లా(Ananthapuram District) దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు ఎస్పీ జగదీష్(SP Jagadeesh) తెలిపారు. అనంతపురం పోలీసులు నిర్వహించిన సెల్‌ఫోన్ల రికవరీ(Recovery of cell phones) మేళాల్లో భారీ సంఖ్యలో ఫోన్లు రికవరీ చేశారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఫోన్ రికవరీ మేళా జాతరలా సాగింది. సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితులంతా క్యూకట్టారు. ఈ క్రమంలో జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో రికవరీ చేసిన 1183 ఫోన్లను బాధితులకు అప్పగించారు. 2022 నుంచి మొత్తం 11,378 మొబైల్స్ రికవరీ చేసినట్లు ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. వీటి విలువ రూ.21.08 కోట్లు ఉంటుందని CEIR పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Next Story