అరటి రైతు ఆత్మహత్య.. జీజీహెచ్ వద్ద టెన్షన్.. టెన్షన్

by Vemula.Srinu Prasad |

అనంతపురం జీజీహెచ్ వ‌ద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది...

అరటి రైతు ఆత్మహత్య.. జీజీహెచ్ వద్ద టెన్షన్.. టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జీజీహెచ్(Ananthapuram GGH) వ‌ద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శింగనమల నియోజకవర్గం(Singanamala Constituency) ఎల్లుట్ల గ్రామంలో అరటి రైతు రైతు(Farmer) ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి నాగలింగం బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. అయితే విషయం తెలుసుకుని ఆస్పత్రి వద్దకు మాజీ మంత్రి శైలజానాథ్‌ వెళ్లారు. హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శైలజానాథ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

అదే సమయంలో జీజీహెచ్‌కు శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వెళ్లారు. రైతు కుటుంబాన్ని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యే బండారు శ్రావణికి మాజీ మంత్రి శైలజానాథ్ సూచించారు. న్యాయం చేస్తామని ఎమ్మెల్యే చెప్పడం ఉద్రిక్తత సద్దుమనిగింది.

Next Story