మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందా?.. రాదా?: పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న టెన్షన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-05 14:41:37  IST  )

ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ విషయంలో టెన్షన్ పెరుగుతోంది...

మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందా?.. రాదా?:  పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసు(Ap Liquor Case)లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Ycp Mp Mithun Reddy) అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు బెయిల్ వస్తుందా..?, రాదా అనే టెన్షన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) శ్రేణుల్లో నెలకొంది. తనకు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ మేరకు ఆగస్టు 12న తీర్పును ధర్మాసనం వెలువరించనుంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఎంపీ మిథన్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. ముందస్తు బెయిల్ విషయంలోనూ ఆయన ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సిట్ తరపున వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులతో పాటు పార్టీ నేతల్లోనూ ఆగస్టు 12న ఏం జరుగుతుందోననే టెన్షన్ పెరుగుతోంది. మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని కోరుతున్నారు. కానీ కోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే సందిగ్ధంలో పడిపోయారు.

Next Story