- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాడిపత్రిలో పరిస్థితి ఉద్రిక్తం.. హైకోర్టులో పోలీసుల లంచ్ మోషన్ పిటిషన్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy) తాడిపత్రి (Thadipathri)కి వెళ్లేందుకు హైకోర్టు అనుమతించిన విషయం విదితమే.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy) తాడిపత్రి (Thadipathri)కి వెళ్లేందుకు హైకోర్టు అనుమతించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఇవాళ తాడిపత్రికి బయలుదేరారు. దీంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు టీమ్ ఆధ్వర్యంలో ఆయనకు ఎస్కార్ట్ చేశారు. సుమారు 750 మంది పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, ఎర్రగుంటపల్లి వంతెనవద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) శివుడి విగ్రహావిష్కరణకు వెళ్లారు. ఇదే సమయంలో పెద్దారెడ్డి కూడా తాడిపత్రికి బయలుదేరడంతో పోలీసులతో పాటు స్థానికల్లో ఏం జరగబోతోందనే ఆందోళన నెలకొంది. శాంతిభద్రతల కారణంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంతో అక్కడ పోలీసులతో వైసీపీ శ్రేణులతో పాటు పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగడంతో వాగ్వాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో పోలసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రిలోకి అనుమతించవద్దంటూ హైకోర్టులో పోలీసుల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో ధర్మాసనం ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.
కేతిరెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్..
దమ్ముంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) సవాల్ విసిరారు. తనకు ఆయనపై ఎలాంటి కక్ష లేదని కామెంట్ చేశారు. కానీ, చేసిన దౌర్జన్యాలపై పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. టీడీపీ నాయకులెవరినీ కూడా తాడిపత్రిలోకి రానివ్వలేదని అన్నారు. హైకోర్టు కాదు.. ఎవరు చెప్పినా తాడిపత్రిలోకి రానివ్వబోమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పోలీసులపై కేతిరెడ్డి ఆరోపణలు మానుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి హితవు పలికారు.






