- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెత్త పన్ను వసూళ్లు.. మరో 10 మందిపై వేటు
చెత్త పన్ను వసూళ్ల చేసిన 10 మంది సిబ్బందిపై వేటు పడింది...

దిశ, వెబ్ డెస్క్: చెత్త పన్ను వసూలు చేసి గత ప్రభుత్వం అబాసు పాలైంది. ఆ చెడ్డ పేరు తమకు వద్దనే ఉద్దేశంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం( Coalition Government) చెత్తపన్నును రద్దు చేసింది. అయితే కొందరు ఉద్యోగులు మాత్రం చెత్త పన్నును అక్రమంగా వసూలు చేస్తున్నారు. పలు హెచ్చరించినా అదే పనిగా ప్రజలనుంచి అక్రమంగా డబ్బులు తీసుకుంటున్నారు. దీంతో అధికారులు సీరియస్ అయ్యారు. చెత్త పన్ను అక్రమంగా వసూళ్లు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది(Muncipal Workers)పై వేటు వేశారు. తాజాగా మరో పదిపైనా వేటు వేశారు. ఇప్పుడు ఈ అంశం కడప(Kadapa) నగరంలో సంచలనంగా మారింది.
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే చెత్త పన్నును రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది. అయినా సరే కడపలో ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే రెడ్దప్పగారి మాధవి రెడ్డి(Mla ReddappaGari Madhavi Reddy) సీరియస్ అయ్యారు. చెత్త పన్ను(Garbage tax) వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా సరే చెత్త పన్ను అక్రమంగా వసూలు చేయడంతో కడప నగర పాలక సంస్థ పరిధిలోని పలువురిని సస్పెండ్ చేశారు. తాజాగా మరో 10 మందిపై వేటు వేశారు.






