- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేసిన మంచిని చెప్పండి.. సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
అధికారం చేపట్టిన తర్వాత మనం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

మీ వ్యవహార శైలితో పార్టీకి మంచి పేరు తేవాలి
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం
అనంతరం లోకేష్‌తో కలిసి ఢిల్లీకి ప్రయాణం
దిశ, డైనమిక్ బ్యూరో : అధికారం చేపట్టిన తర్వాత మనం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. ప్రజలు మనవైపు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అమరావతి నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ అంశాలపై చర్చించారు. సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. చేసిన పనులను ప్రజలకు చెప్పుకోవాలని ఆయన సూచించారు.అప్పుడే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. ప్రజలతో మమేకమై మంచి పేరు తెచ్చుకోవాలని తెలిపారు. సమర్థ పాలనకు, అసమర్థ పాలనకు తేడాలు వివరించాలన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పార్టీ ప్రతినిధులు వ్యవహరించాలని ఆయన సూచించారు.
కూటమిగా ఉన్నాం.. ప్రజలు మనకు అద్భుత విజయాన్ని కట్టబెట్టారని తెలిపారు. అంతకు మించిన స్థాయిలో మళ్లీ విజయం దక్కేలా కూటమి పార్టీలు బలపడాలని అన్నారు. సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. చేసిన పని చెబితేనే ప్రజల్లో ప్రభుత్వం పట్ట నమ్మకం పెరుగుతుందన్నారు. ప్రజల్లో మమేకమే కాదు.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ప్రతినిధుల వ్యవహార శైలితో పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. గత ప్రభుత్వం ట్రూఅప్‌చార్జీల పేరుతో విద్యుత్‌చార్జీలను పెంచిందన్నారు. కూటమి ప్రభుత్వం ట్రూడౌన్పేరుతో విద్యుత్‌చార్జీలను తగ్గిస్తోందని తెలిపారు. సోలార్, విండ్వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టిపెట్టామన్నారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే లాబాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజలు మనవైపు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ఢిల్లీ బయలు దేరిన సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీఐఐ పార్టనర్షిప్సమ్మిట్కర్టెన్రైజర్ కార్యక్రమానికి వారిద్దరు హాజరు కానున్నారు. ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్ంలో పారిశ్రామికవేత్తలతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. విశాఖ సదస్సుకు పారిశ్రామిక వేత్తలను చంద్రబాబు, లోకేష్ఆహ్వానించనున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీకి చేరుకున్నారు.ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉంది. అక్టోబర్ 16న కర్నూలులో జీఎస్టీ 2.0 కార్యక్రమానికి ప్రధాని మోడీని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలతో సీఎం భేటీ కానున్నారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు సీఐఐ సదస్సులో పాల్గొంటారు.రాత్రి 8 గంటలకు అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఎం చర్చలు జరిపే అవకాశం ఉంది. పలువురు కేంద్రమంత్రులను మంత్రి లోకేశ్ కలిసే అవకాశం ఉంది. రాష్ట్ర ఐటీ, విద్య రంగాలకు సంబంధించిన కేంద్ర సహకారంపై చర్చించనున్నట్లు తెలిసింది. ఒకే రోజు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వెళుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.






