కేసీఆర్ సర్కార్ వల్ల ఏపీకి ముప్పు.. వైసీపీ అడ్డుకోకపోతే అధోగతే

by Disha Web Desk 21 |
కేసీఆర్ సర్కార్ వల్ల ఏపీకి ముప్పు.. వైసీపీ అడ్డుకోకపోతే అధోగతే
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవాలని ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లెలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. రోమ్‌ నగరం తగలబడి పోతుంటే నిరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నట్లు వైఎస్ జగన్ వైఖరి ఉందని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ ప్రభుత్వం కృష్ణానదిపైన శ్రీశైలం రిజర్వాయర్‌ ఆధారంగా 90టీఎంసీల సామర్థ్యంతో పోలవరం - రంగారెడ్డి, 30టీఎంసీల సామర్థ్యంతో డిండి ఎత్తి పోతల ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 25 టీఎంసీల నుంచి 40టీఎంసీలకు పెంచారు అని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాదు 19.60టీఎంసీలతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్నారని తులసిరెడ్డి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టులకు కేంద్ర జలశక్తి సంఘం, కష్ణానది యాజమాన్య బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అమోదం లేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులేవీ కూడా ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో లేవని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మెుండిగా, దౌర్జన్యంగా ప్రాజెక్టులను నిర్మిస్తుందని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలోని తెలుగు గంగ, గాలేరి - నగరి, ఎస్ఆర్‌బీసీ, హంద్రీనీవా, వెలుగొడు, నాగార్జున సాగర్‌, కృష్ణా డెల్టాకు కృష్ణా జలాలు రాక 50 లక్షల ఎకరాలు సాగు భూమి బీడు భూములుగా మారి తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు తీరని నష్టం వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు. సాగునీటికే కాదు తాగునీటి సమస్యలు కూడా ఏర్పడతాయని అంతేకాకుండా పరిశ్రమలకు నీరు లేక మూత పడుతాయని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాబోయే రోజుల్లో రాష్ట్రానికి పెను ప్రమాదదం జరగబోతుంటే అధికార వైసీపీ గానీ ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డా.ఎన్ తులసిరెడ్డి అన్నారు.

Next Story

Most Viewed