నేడు పుట్టపర్తికి విచ్చేయనున్న తెలంగాణ సీఎం

by Thanuru Gopichand |   (  Updated:2025-11-23 10:42:52  IST  )

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు పుట్టపర్తికి విచ్చేయనున్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలకు (Satya Saibaba Birth Anniversary) హాజరుకానున్నారు.

నేడు పుట్టపర్తికి విచ్చేయనున్న తెలంగాణ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు పుట్టపర్తికి విచ్చేయనున్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలకు (Satya Saibaba Birth Anniversary) హాజరుకానున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి చేరుకుంటారు. అనంతరం అక్కడ సాయి కుల్వంత్ హాల్లో జరుగుతున్న వేడుకల్లో పాల్గొంటారు. సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. డిసెంబర్ 8 నుంచి 11 వరకు ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ 2025 జరగనున్న నేపథ్యంలో అక్కడ పనులను పరిశీలిస్తారు. అయితే శనివారం సీఎం రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్ సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలను, యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ, క్రీడా యూనివర్సిటీతోపాటు ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను సీఎం ఆయనకు వివరించిన విషయం విదితమే. ఈ క్రమంలో పుట్టపర్తికి సీఎం రేవంత్ రెడ్డి రాకపై ఆసక్తి నెలకొంది.

READ MORE ....

ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు : సీఎం రేవంత్ రెడ్డి

Next Story