- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బనకచర్ల వివాదంపై టెక్నికల్ కమిటీ : మంత్రి నిమ్మల రామానాయుడు
తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఈ భేటీలో ఏపీ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన 10 అంశాలపై ఈ భేటీలో చర్చించారు. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం అజెండాలో చేర్చింది. భేటీ అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... మూడు ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
ఇరు రాష్ట్రాలలో ఉన్నటువంటి రిజర్వాయర్లు, వాటి అవుట్‌ఫ్లో వద్ద టెలీమెట్రీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టుపై నిపుణులు ఇచ్చిన సూచనల మేరకు వెనువెంటనే రక్షణ చర్యలు వెంటనే చేపడతామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. కృష్ణాబోర్డు అమరావతిలో ఉండేలా.. గోదావరికి బోర్డు తెలంగాణ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పై తెలంగాణ లేవనెత్తిన అంశాల్లో సాంకేతిక విషయాలపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగిందన్నారు.
వచ్చే సోమవారంలోగా ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. గోదావరి కృష్ణా జలాలపై చర్చించామన్నారు. ఏపీ తెలంగాణ టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్సంబంధించి నిపుణులు ఉంటారని తెలిపారు. గోదావరిలో ఏటా నీరు వృధా అవుతుందన్నారు. కాగా ఈ భేటీకి ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు హాజరయ్యారు.






