- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేముండగా అది జరగదు: స్టీల్ ప్లాంట్‌పై పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు...

X
దిశ,వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ప్రైవేటీకరణ జరగబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్(YSR Congress) పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు(Gajuwaka MLA Palla Srinivasa Rao) స్పందించారు. స్టీల్‌ప్లాంట్‌పై కావాలనే కొందరు అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కూటమి అధికారంలో ఉన్నంతవరకు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాకే పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. స్టీల్‌ప్లాంట్ భూ నిర్వాసితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్మిక నేతలు బాధ్యతగా ఉండాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు.
Next Story






