- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ కుట్రలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలి.. టీడీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని జగన్ ఏపీపై కుట్రలు చేస్తున్నారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని జగన్ ఏపీపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీతో జగన్ కు అసలు ఏం సంబంధం అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఉన్నా కూడా ఉమ్మడిరాష్ట్రంలో ఉన్నారనే సంబంధాలు ఉండేవని, కానీ బెంగళూరుతో ఏపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. మద్రాస్ తో కలిసి ఉన్నామని కానీ బెంగళూరుతో అసలు ఎలాంటి సంబంధాలు లేవని అన్నారు.
బెంగళూరులో ఉన్నారంటే కచ్చితంగా కుట్రకోణం దాగి ఉందన్నారు.కేంద్ర దర్యాప్తు సంస్థలు బెంగళూరు ప్యాలెస్ లో జగన్ చేస్తున్న కుట్రలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్ అసెంబ్లీకి కూడా రావడంలేదని రాబోయే కాలంలో అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కూడా ఉండదన్నారు. గతంలో వైసీపీకి ప్రజలు అవకాశం ఇచ్చారు కానీ భవిష్యత్ లో వార్డ్ మెంబర్ గా కూడా గెలిసే అవకాశం లేదని అన్నారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సెల్ ఫోన్ లో వీడియో తీశానని వాటిని జగన్ రెడ్డికి పంపిస్తానని వ్యాఖ్యానించారు.






