వాళ్లంతా కలిసే ఉన్నారు: బాలయ్య, చిరంజీవి విభేదాలపై బుచ్చయ్య చౌదరి క్లారిటీ

by Vemula.Srinu Prasad |

బాలయ్య, చిరంజీవి మధ్య ఎలాంటి విభేదాలు లేవని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తెలిపారు..

వాళ్లంతా కలిసే ఉన్నారు: బాలయ్య, చిరంజీవి విభేదాలపై బుచ్చయ్య చౌదరి క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: వాళ్లంతా కలిసే ఉన్నారని, చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna) మధ్య ఎలాంటి విభేదాలు లేవని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Mla Gorantla Buchaiah Chowdary) తెలిపారు. అసెంబ్లీలో బాలయ్య చేసిన కామెంట్స్‌పై రాజమండ్రి(Rajahmundry)లో ఆయన తాజాగా స్పందించారు. సంబంధం లేని విషయాన్ని కామినేని లేవనెత్తారని, దానిపై బాలయ్య రియాక్ట్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం ఆ వివాదం సమసిపోయిందని, ఇప్పుడు చర్చ అవసరంలేదన్నారు. సినీ నటుడు పరస్పరం అవగాహనతో అన్నదమ్ముల్లా కలిసి కట్టుగా ప్రయాణం చేసేవాళ్లని తెలిపారు. గత ప్రభుత్వంలో సినిమా హీరోలను అవమానించారని తెలిపారు. ఆ రోజు జగన్ నియంతలా వ్యవహరించారు కాబట్టే ఆ అంశం అసెంబ్లీకి వచ్చిందని బుచ్చయ్య పేర్కొన్నారు.

Next Story