- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లిని, చెల్లిని జగన్ రోడ్డుకు ఈడ్చారు: సోమిరెడ్డి సంచలన ఆరోపణలు
ఆస్తుల వివాదం నేపథ్యంలో వైఎస్ విజయమ్మ అఫిడవిట్ విడుదల చేసి ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు..

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) కుటుంబంలో ఆస్తుల వివాదం నేపథ్యంలో వైఎస్ జగన్(Ys Jagan) తీరుపై ఆయన తల్లి విజయమ్మ(Vijayamma) అఫిడవిట్ విడుదల చేసి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే విజయమ్మ ఆవేదనపై మాజీ మంత్రి, టీడీపీ(Tdp) సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Somireddy Chandramohan Reddy) స్పందించారు. వైఎస్ జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఆస్తుల విషయంలో కన్నతల్లి విజయమ్మకు, చెల్లి షర్మిలకు జగన్ తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల కోసమే తల్లిని కూడా లెక్కచేయకుండా ఆమెను రోడ్డుకు ఈడ్చారని, ఇది అత్యంత దారుణమని సోమిరెడ్డి మండిపడ్డారు.
లోకేష్‌కు, జగన్‌కు తేడా అదే..
తన తల్లి విజయమ్మకు వ్యతిరేకంగా సొంత పత్రికలో కథనాలు రాయించిన ఘనత జగన్‌కే దక్కుతుందని సోమిరెడ్డి విమర్శించారు. తల్లికి జరిగిన అవమానంపై లోకేష్ చేసిన పోరాటాన్ని సోమిరెడ్డి గుర్తుచేశారు. తన తండ్రి చంద్రబాబు నాయుడును మళ్ళీ సీఎం సీటులో కూర్చోబెట్టే వరకు లోకేష్ విశ్రమించకుండా పోరాడారని తెలిపారు. ఒకవైపు జగన్ తన కుటుంబంలో చిచ్చులు పెడుతుంటే, లోకేష్ మాత్రం తన తండ్రి గౌరవం కోసం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమించారని సోమిరెడ్డి గుర్తు చేస్తూ జగన్‌పై విమర్శలు కురిపించారు.






