మేమొచ్చే ఆదుకున్నాం.. అంతకుముందంతా నిర్లక్ష్యమే: ధూళిపాళ్ల నరేంద్ర

by Vemula.Srinu Prasad |

రైతుల పేరుతో వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. తనపై వైసీపీ శ్రేణులు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

మేమొచ్చే ఆదుకున్నాం.. అంతకుముందంతా నిర్లక్ష్యమే: ధూళిపాళ్ల నరేంద్ర
X

దిశ, వెబ్ డెస్క్: రైతుల(Farmers) పేరుతో వైసీపీ(Ycp) నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర(TDP senior leader Dhulipalla Narendra) అన్నారు. తనపై వైసీపీ శ్రేణులు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో భూములు, కాంట్రాక్టుల పేరుతో దోచుకున్నారని మండిపడ్డారు. గుంటూరు చానల్(Guntur Channel) అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వమే పంటముంపునకు కారణమని నరేంద్ర ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకున్నామని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.

Next Story