- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గడ్డాలు, మీసాలు మాకూ ఉన్నాయి: అంబటికి బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్
గడ్డాలు, మీసాలు తమకూ ఉన్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబుకు టీడీపీ లీడర్ బుద్ధా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు...

దిశ, వెబ్ డెస్క్: గడ్డాలు, మీసాలు తమకూ ఉన్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu)కి టీడీపీ నేత బుద్దా వెంకన్న(TDP leader Buddha Venkanna) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లక్కీ డ్రా పేరుతో మోసం చేసిన కేసులో అంబటిని కోర్టుకు హాజరుపరుస్తున్న నేపథ్యంలో ఆయన ‘పుష్ప’ సినిమా('Pushpa' movie) హీరో స్ట్రైల్లో తగ్గేలే అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అంబటి తీరుపై బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకూ గడ్డాలు, మీసాలున్నాయని, తాము కూడా తగ్గేది లేదని హెచ్చరించారు. సీఎం చంద్రబాబుపై దూషణలు ఆపకపోతే ఊరుకోమన్నారు. అంబటిపై పలు అవినీతి కేసులున్నాయని, కోర్టుకు వెళ్తూ ‘పుష్ప’లా స్టంట్ చేయడం దారణమని బుద్దా వెంకన్న మండిపడ్డారు.
అంబటి రాంబాబు ఆధ్వర్యంలో..
కాగా వైసీపీ హయాంలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల పేరుతో సత్తెనపల్లి నియోజకవర్గంలో లక్కీ డ్రా నిర్వహించారు. అయితే ఇందులో అంబటి భారీగా అవినీతికి పాల్పడ్డారని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో అంబటిపై కేసు నమోదు అయింది. ఇప్పటికే రెండు కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. ఈ రెండు కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు అయింది. అంతలోనే లక్కీ డ్రా పేరుతో మోసం చేసిన కేసులో ఆయన్ను కోర్టులో హాజరుపర్చేందుకు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను రాజమండ్రి జైలు నుంచి గుంటూరు కోర్టుకు తీసుకొచ్చే సమయంలో అంబటి తగ్గేదే లే అంటూ పుష్ప స్టైల్ ప్రదర్శించారు. దీంతో అంబటిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతచచ్చినా పులుపుచావలేదన్న సామెతతో అంబటిపై విమర్శలు కురిపిస్తున్నారు.






