త్వరలో జైలుకు జగన్‌, అవినాష్‌రెడ్డి: టీడీపీ నేత సంచలన జోస్యం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-25 10:42:35  IST  )

జగన్‌, అవినాశ్‌రెడ్డి జైలుకు వెళ్తారని టీడీపీ నేత బీటెక్‌ రవి అన్నారు..

త్వరలో జైలుకు జగన్‌, అవినాష్‌రెడ్డి:  టీడీపీ నేత సంచలన జోస్యం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy), కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి(Kadap Mp Avinash Reddy) జైలుకు వెళ్తారని టీడీపీ నేత బీటెక్‌ రవి(Tdp Leader Btech Ravi) అన్నారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు (Tdp Mahanadu)ఏర్పాట్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivas)తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ వచ్చే మహానాడు నాటికి వైసీపీ నేతలు జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.


అటు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్ హయాంలో అవినీతి, ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలు జరిగాయని, తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. పిన్నెల్లి హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. మాచర్ల టీడీపీ నేతల హత్య హంతకులను వదిలిపెట్టబోమని పల్లా శ్రీనివాసరావుహెచ్చరించారు.

Next Story