Ap News: ఎమ్మెల్యే రాపాకకు బోండా ఉమ స్ట్రాంగ్ కౌంటర్

by Disha Web Desk 16 |
Ap News: ఎమ్మెల్యే రాపాకకు బోండా ఉమ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. రాపాక ఇప్పటికే వైసీపీకి అమ్ముడుపోయాడని..టీడీపీపై చేసే ఆరోపణలన్నీ తాడేపల్లి స్క్రిప్టేనని ఆయన చెప్పారు. రాపాకను రూ.10 కోట్లకు కొనేది ఎవరని.. రూ.10 వేలు కూడా ఎక్కువేనని ఎద్దేవా చేశారు. సైకిల్ గుర్తుపై గెలిచిన వాళ్ల ఓటు అక్కర్లేదని జగన్ ఏమైనా చెప్పారా? అని ప్రశ్నించారు. ఓటేయని అడిగిన రోజే రాపాక ఎందుకు బహిరంగపర్చలేదని బోండా ఉమ నిలదీశారు. మరో నెల రోజుల్లో 40 మంది ఎమ్మెల్యేలు తిరుగబాటు చేయనున్నారని జోస్యం చెప్పారు. మరో 60-70 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బోండా ఉమ తెలిపారు. ఎమ్మెల్యేల తిరుగుబాటు ద్వారా ప్రభుత్వం కుప్పకూలడం ఖామని బోండా ఉమ పేర్కొన్నారు.

కాగా ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 23 ఓట్లతో గెలిచింది. క్రాస్ ఓటింగ్ జరగడం వల్లేనని టీడీపీ గెలిచినట్లు స్పష్టమైంది. నాలుగు ఓట్లు వైసీపీ ఎమ్మెల్యేలు వేయడంతో రాజకీయ దుమారం రేపింది. ఈ నేపథ్యంలో రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఓటు వేస్తే రూ.10 కోట్లు ఇస్తానన్నారని, తాను ఒప్పుకోలేదని రాపాక అన్నారు. దీంతో ఎమ్మెల్యే రాపాకపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story