Kethireddy Peddareddy : పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి

by Muthe.Rajitha |   (  Updated:2024-08-20 14:53:21  IST  )

వైసీపీ మాజీ ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు.

Kethireddy Peddareddy : పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ మాజీ ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. కొన్ని విలువైన పత్రాల కోసం పెద్దారెడ్డి మంగళవారం తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్ళగా.. పెద్దారెడ్డి రాక సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేశారు. దాడుల విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి అనుచరులు భారీ ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. అయితే టీడీపీ కార్యకర్తల రాక కంటే ముందే పెద్దారెడ్డిని పోలీసులు సేఫ్ గా తిమ్మంపల్లికి తరలించగా.. ఆవేశంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆ తర్వాత వైసీపీ ఎంఎల్ఏ మురళి ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన మురళి డబుల్ బ్యారేల్ గన్ తో బయటికి రాగా, పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను అక్కడి నుండి చెదరగొట్టారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా, మురళి ఇంటిలోని ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. వైసీపీ వర్గీయులకు చెందిన రెండు కార్లు, పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి.

Next Story