- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలోని అన్నదాతలకు తీపికబురు.. మంత్రి అనగాని కీలక ప్రకటన
రాష్ట్రంలోని అన్నదాతలకు కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది. అతి త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోబోతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అన్నదాతలకు కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది. అతి త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోబోతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూములకు ఆధార్, సర్వే నంబర్లను లింక్ చేసి భూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అర్జీల ద్వారా వచ్చిన 4.63 లక్షల ఫిర్యాదుల్లో 3.99 లక్షల ఫిర్యాదులను ఇప్పటికే పరిష్కరించినట్లు అనగాని తెలిపారు.
కాగా, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ‘మీ భూమి-మీ హక్కు’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహించిన విషయం తెలిసిందే. సదస్సుల నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక్కో ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. ఈ సదస్సుల్లో పాల్గొనేందుకు రెవెన్యూ యంత్రాంగం అంతా నేరుగా గ్రామాలకు వెళ్లారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చుట్టూ తిరగడం కాకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు.






