రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు విచారణ.. ఏపీ సర్కారుకు నోటీసులు

by Kema Shiva Kumar |

దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై జరగుతోన్న రోడ్డు ప్రమాదాలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు విచారణ.. ఏపీ సర్కారుకు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై జరగుతోన్న రోడ్డు ప్రమాదాలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, రోడ్డు వెంట ఉన్న పర్మీషన్ లేని దాబాలు, అధ్వన్నంగా రోడ్ల నిర్వహణతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని జరుగుతున్నాయని జస్టిస్ జేకే. మహేశ్వరి (Justice JK Maheshwari), జస్టిస్ విజయ్ బిష్ణోయ్ (Justice Vijay Bishnoi) ధర్మాసనం పేర్కొంది.

కాగా, ఇవాళ ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌లలోని జాతీయ రహదారులపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను సుప్రీంకోర్టు సుమోటో (Sumoto)గా విచారణ చేపట్టింది. ఈ రెండు రాష్ట్రాల హైవేల ప్రమాద ఘటనలపై నివేదిక సమర్పించాలని ఎన్‌హెచ్‌ఏఐ (NHAI), కేంద్ర రవాణా శాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh, రాజస్థాన్ (Rajasthan) ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రహదారులపై అనుమతి లేకుండా ఎన్ని దాబాలు ఉన్నాయో వెంటనే సమగ్రంగా సర్వే చేయాలని, రోడ్డు నియమ నిబంధనలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అదేవిధంగా రోడ్ల నిర్వహణలో కాంట్రాక్టర్లు తగిన ప్రమాణాలు పాటించారో లేదో వెల్లడించాలని పేర్కొంది. కాగా రాజస్థాన్‌లోని ఫాలోడీలో ఇటీవల జరిగిన ప్రమాదంలో 18 మంది, శ్రీకాకుళంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Next Story