ఏపీలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ.. సీఎంతో పాటు మంత్రుల హాజరు

by Thanuru Gopichand |   (  Updated:2025-11-26 05:57:27  IST  )

అమరావతిలో (Amaravati) విద్యార్థుల కోసం పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మాక్ అసెంబ్లీ (Mock Assembly) ప్రారంభమైంది.

ఏపీలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ.. సీఎంతో పాటు మంత్రుల హాజరు
X

దిశ, వెబ్ డెస్క్ : అమరావతిలో (Amaravati) విద్యార్థుల కోసం పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మాక్ అసెంబ్లీ (Mock Assembly) ప్రారంభమైంది. పరీక్షల నిర్వహణ ద్వారా మాక్ అసెంబ్లీకి విద్యార్థులను ఇటీవల ఎంపిక చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో మాక్ అసెంబ్లీని ఈ రోజు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తోపాటు ఇతర మంత్రులు మాక్ అసెంబ్లీని దగ్గరుండి చూస్తున్నారు. ఉదయం 9.30 గంటల సమయంలో ప్రారంభమైన మాక్ అసెంబ్లీలో కోడూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేశ్వర్ రెడ్డి, స్వాతిని అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించడం ఆకట్టుకుంది. తాడేపల్లి ఎమ్మెల్యే పి.ఆంజనేయులు కుమార్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అలా స్వామి స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అధికారపక్ష, ప్రతిపక్ష నేతలు కలిసి స్వీకర్ ను సభావేదిక వద్దకు ఆహ్వానించడం అందరినీ అబ్బుపరచింది.

ఈ మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం.లీలాగౌతమ్, ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యా శాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకరుగా కాకినాడ జిల్లాకు చెందని స్వాతి వ్యవహరిస్తున్నారు. పలు బిల్లులను ప్రవేశపెట్టి వాటిపై కాసేపు చర్చించనున్నారు.

సామాజిక మాధ్యమాల నియంత్రణ బిల్లు, విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్లు వంటి వాటిపై మంత్రులుగా వ్యవహరిస్తున్న విద్యార్థులు చర్చించి తీర్మానాలు చేయనున్నారు. మాక్ అసెంబ్లీ ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45 వేల పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

Next Story