- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video: గురువులకు ఇచ్చే గౌరవం ఇదేనా? టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఎందుకంటే?
ఈ తరం పిల్లలు తమ గురువులకు ఇచ్చే గౌరవం ఇది అని ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ తరం పిల్లలు తమ గురువులకు ఇచ్చే గౌరవం ఇది అని ఓ వీడియో నెట్టింట చక్కర్లు (Viral Video) కొడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో ఉన్న (Raghu Engineering College) రఘు ఇంజనీరింగ్ కళాశాలలో టీచర్, విద్యార్థిని మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది. వీడియోలో చూపించిన ప్రకారం.. టీచర్ విద్యార్థిని మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీచర్ ఫోన్ తీసుకుందని ఆ ఫోన్ 12 వేలు అంటూ విద్యార్థిని టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. ఫోన్ ఇస్తావా చెప్పుతో కొట్టమంటావా అంటూ చెప్పు తీసింది. టీచర్ ఇవ్వను అనేసరికి.. సహనం కోల్పోయిన విద్యార్థిని టీచర్‌పై తన చెప్పుతో కొట్టి దాడికి (Student Teacher Fight) ప్రయత్నించింది. దీంతో టీచర్ సైతం స్టూడెంట్‌పై చేయిచేసుకోవాల్సి వచ్చింది. వెంటనే అక్కడ ఉన్నవారు వారిని కంట్రోల్ చేశారు. తన మొబైల్ ఫోన్ తీసుకోవడంతో టీచర్‌పై స్టూడెంట్ విరుచుకపడినట్లు తెలుస్తోంది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. స్టూడెంట్ అలా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
‘ఈ తరం పిల్లలు తమ గురువులకు ఇచ్చే గౌరవం ఇది. తప్పు పిల్లలది కాదు, తల్లిదండ్రులు, టీచర్లదే. పిల్లలకు ఫోన్లు కొనివ్వడం, వాళ్ళ గౌరవం కోసం లక్షల రూపాయల ఫీజులు కట్టే తల్లిదండ్రులు, లక్షల రూపాయల ఫీజులు తీసుకోని అమ్ముడుపోయిన టీచర్లు గౌరవాన్ని ఆశించడం సరైందేనా?’ అని ఓ నెటిజన్ వీడియో పోస్ట్ చేశారు. ‘తల్లిదండ్రుల తప్పు ఇందులో వంద శాతం ఉంది. పిల్లల్ని చాలా గారాబంగా పెంచుతున్నారు. ఒక చిన్న పని కూడా నేర్పడం లేదు. భవిష్యత్తు చాలా భయంగా ఉంది.’ అని ఓ నెటిజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రతి దానికి పిల్లలు ని తప్పు పట్టడం మనకు అలవాటు.. టీచర్ ది కూడా తప్పు ఉండవచ్చు’ అని ఓ నెటిజన్ ఆసక్తికరంగా పెట్టారు. ‘ఈ స్మార్ట్ మొబైల్ కాలం వచ్చినప్పటి నుంచి ఇదిగో ఇలానే తయారయ్యింది. ఇందులో డబ్బులు గుంజే కళాశాలల బాధ్యత ఎంత ఉందో, మన తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ఉంది.’ అని ఓ నెటిజన్ కామెంట్ ఇచ్చారు.






