- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయనగరం జిల్లాలో విద్యార్థిని మృతి
by Thanuru Gopichand |
విజయనగరం జిల్లాలో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్ : విజయనగరం జిల్లాలో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ విషయాన్ని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం విజయనగరంలోని గొట్లాంలో ఉన్న గాయత్రి కళాశాలలో ఓ విద్యార్థిని చదువుతోంది. ఆ విద్యార్థిని ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తమ కుమార్తె మృతి పట్ల కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ బిడ్డ మరణానికి కాలేజీ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మృతిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. అసలు విద్యార్థిని ఎందుకు మరణించింది? ఆమె మరణానికి గల కారణాలపై సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






