- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో తుపాను బీభత్సం.. 30 మంది విద్యార్థినులకు కరెంట్ షాక్!
‘మొంథా’ తుపాన్ బీభత్సంతో ఏకంగా 30 విద్యార్థినులకు కరెంట్ షాక్ తగిలిన ఘటన విజయనగరం (Vizianagaram) జిల్లాల్లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ‘మొంథా’ తుపాన్ బీభత్సంతో ఏకంగా 30 విద్యార్థినులకు కరెంట్ షాక్ తగిలిన ఘటన విజయనగరం (Vizianagaram) జిల్లాల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. గుర్ల (Gurla)లో బలమైన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభం కూలిపోయి పక్కనే కేజీబీవీ (KGBV) హాస్టల్ బిల్డింగ్ గోడను తాకింది. ఈ క్రమంలోనే అందులో ఉన్న 30 మంది విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. అందులో ఐదురుగు విద్యార్థినులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ మేరకు వారిని చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక మొంథా తుపాను ప్రభావంతో కోస్తా ఆంధ్రా జిల్లాలో భారీ నష్టం జరిగింది. అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి వందలాది చెట్లు నెలకూలాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, మన్యం పార్వతీపురం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూల్, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోనూ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.






