అమరావతిలో రైల్వే లైన్.... కొప్పరావూరు రైతులకు నోటీసులు

by Vemula.Srinu Prasad |

ఏపీ కలల రాజధాని అమరావతిలో రైల్వే లైన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి..

అమరావతిలో రైల్వే లైన్.... కొప్పరావూరు రైతులకు నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కలల రాజధాని అమరావతి(Amaravati)లో రైల్వే లైన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తొలి దశలో 27 కిలో మీటర్ల మేర పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 12 గ్రామాల పరిధిలో రైల్వే లైన్ వెంబడి మార్కింగ్ కూడా వేశారు. ఈ మేరకు రైతుల నుంచి భూమి తీసుకునేందుకు అధికారులు కసరత్తులు చేపట్టారు. కొప్పరావూరులో రైల్వే లైన్ ఏర్పాటుపై దూకుడు పెంచారు. మొత్తం కొప్పరావూరులో 2.57 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 27 ఎకరాల 43 సెంట్లు సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామంలో భూసేకరణ చేయనున్నారు. ఇందుకోసం రైతులకు నోటీసులు జారీ చేశారు. అభ్యంతరాలు తెలపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 22న 3 గంటలకు ధ్రువపత్రాలు తీసుకురావాలని రైతులకు గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ్‌తేజ పిలుపునిచ్చారు.

Next Story