అమరావతిలో రాష్ట్ర మంత్రి నారాయణ పర్యటన

by Thanuru Gopichand |   (  Updated:2025-11-22 05:27:14  IST  )

అమరావతి (Amaravati) రాజధాని ప్రాంతంలో రాష్ట్ర పురపాలక పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) పర్యటించారు.

అమరావతిలో రాష్ట్ర మంత్రి నారాయణ పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్ : అమరావతి (Amaravati) రాజధాని ప్రాంతంలో రాష్ట్ర పురపాలక పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) పర్యటించారు. శనివారం పర్యటనలో భాగంగా రాజధానిని 16 వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయడంలో కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు పనులను పరిశీలించారు. కొండవీటి వాగు, గుంటూరు చానెల్, బకింగ్ హాయ్ కెనాల్స్ పై బ్రిడ్జి నిర్మాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీడ్ యాక్సిస్ రోడ్డు (Seed Access Road) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా కొండవీటి వాగు ఎత్తిపోతల దగ్గర స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. రహదారులను వేగంగా అభివృద్ధి చేసి రాజధానిలో కనెక్టెవిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందన్నారు. మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పనులను చేపడుతోందని తెలిపారు. గతంలో పెనుమాక, ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ కు కొంత భూమి ఇవ్వకపోవడంతో నిలిచిన రోడ్డు పనులు నిలిచాయన్నారు. విజయవాడ నుంచి రాజధానికి కరకట్ట మీదుగా వెళ్లే అవసరం లేకుండా త్వరితగతిన సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story