- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగులకు అలర్ట్.. ప్రభుత్వ సెలవు తేదీ మార్పు
by Naga Rani Yarlagadda |
ప్రభుత్వ సెలవు తేదీని మారుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ సెలవు తేదీని మారుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండుగ ఉండగా.. ముందు 27న సెలవు ప్రకటించింది. ప్రభుత్వ సెలవు క్యాలెండర్ లో 27గా పేర్కొన్న బక్రీద్ సెలవును తాజాగా 28కి మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. వక్ఫ్ బోర్డు సీఈఓ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీఓ 1006ను విడుదల చేశారు. ఉద్యోగులంతా ఈ విషయాన్ని గ్రహించాలని కోరింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ మార్పు వర్తిస్తుందని తెలిపింది.
Next Story






