- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు: స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్!
సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యామిలీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యామిలీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. స్టాండప్ కామెడీ షోల పేరుతో అనుదీప్ కటికల గతంలో చేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో పవన్ కల్యాణ్ మూడు వివాహాలను ఉద్దేశిస్తూ, అలాగే మెగా కుటుంబానికి చెందిన నిహారిక కొణిదెల విడాకుల వ్యవహారాన్ని జోడిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. కుటుంబ సభ్యులను, మహిళలను కించపరిచేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
పోలీస్ యాక్షన్..
అనుదీప్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ జనసేన పార్టీ నాయకుడు బడే వెంకట కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వేగంగా స్పందించిన కాకినాడ I-టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. వివాదం ముదరడంతో అనుదీప్ ఆ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల నుండి తొలగించినప్పటికీ, అప్పటికే అవి వైరల్ కావడంతో చట్టపరమైన చర్యలు తప్పలేదు. ప్రస్తుతం నిందితుడిని కాకినాడకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.






