- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సృష్టి ఫెర్టిలిటీ’ ఎఫెక్ట్.. 11 IVF సెంటర్లపై DMHO దాడులు
సరోగసీ (Surrogacy) ముసుగులో శిశు విక్రయాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసు యంత్రాంగం ఫుల్ ఫోకస్ పెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: సరోగసీ (Surrogacy) ముసుగులో శిశు విక్రయాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసు యంత్రాంగంతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ (Universal Creation Fertility Center) నుంచి తెలంగాణ పోలీసులు కీలక రికార్డులను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో సహా తెలంగాణలో సుమారు 30 మందిపైగా చిన్నారులు చేతులు మారినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, వైద్యాధికారులతో ఆయా ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకుల సంబంధాలపై తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే తిరుపతి (Tirupati)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలోని 11 ఫెర్టిలిటీ సెంటర్లపై డీఎంహెచ్‌వో (DMHO), సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు వెలుగులోకి రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఈ దాడులు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం లావణ్య ఫెర్టిలిటీ సెంటర్‌లో సరోగసి వివరాలకు సంబంధించి రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.






