- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత.. పెరుగుతున్న పర్యాటకుల తాకిడి
శ్రీశైలం జలాశయానికి (Srisailam Project) వరద ప్రవాహం కొనసాగుతుండటంతో బుధవారం కూడా 8 గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కు నీటి విడుదల కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం జలాశయానికి (Srisailam Project) వరద ప్రవాహం కొనసాగుతుండటంతో బుధవారం కూడా 8 గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కు నీటి విడుదల కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,89,670 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 3,02,478 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
8 క్రస్ట్ గేట్ల నుంచి 2,16,520 క్యూసెక్కుల నీటిని సాగర్ కు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 20వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,643 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,643 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 203.42 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు 8 గేట్ల నుంచి నీరు విడుదల కాగా.. ఆ సుందర దృశ్యాన్ని కనులారా చూసేందుకు పర్యాటకులు విచ్చేస్తున్నారు.






