- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం | డిజిటల్ చెల్లింపులకు భక్తుల ఇబ్బందులు
శ్రీశైలం (Srisailam) మహాక్షేత్రానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. ఆదివారం కావడంతో రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీశైలం (Srisailam) మహాక్షేత్రానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. ఆదివారం కావడంతో రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం పరితపిస్తున్నారు. భక్తుల రాకపోకలతో శ్రీశైలమంతటా సందడిగా మారింది. భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి వారి నామ స్మరణతో శ్రీశైలం వీధులు మారుమ్రోగుతున్నాయి. దేవాలయ క్యూలైన్లలో భక్తులు అధిక సంఖ్యలో నిలబడుతున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దర్శనానికి కొంత ఎక్కువ సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేశామని పేర్కొంటున్నారు.
ఏటీఎంలు పని చేయక నగదు సమస్య!
అయితే భక్తులు వేలాదిగా శ్రీశైల క్షేత్రానికి తరలి వస్తున్న నేపథ్యంలో.. పలు సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు సమాచారం. శ్రీశైలంలోని పలు ఏటీఎంలు సరిగ్గా పని చేయడం లేదని భక్తులు చెబుతున్నారు. చాలా వరకు డిజిటల్ చెల్లింపులపైనే ప్రజలు ఆధారపడుతున్నారు. నగదును దగ్గర ఉంచుకోవడం లేదు. దీంతో ఒక్కసారిగా ఏటీఎంలలో సమస్య తలెత్తడం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. దర్శన టోకెన్ల సమయంలో చెల్లింపులు చేయదలచినా.. డిజిటల్ చెల్లింపుల అవకాశం లేకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదని తెలుస్తోంది. ఈ సమస్య వల్ల చాలా వరకు భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. యూపీఐ లావాదేవీలపైనే అధిక సంఖ్యలో ఆధారపడడం వల్ల నగదు లావాదేవీలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా పలువురు భక్తులు కొనుగోళ్లు నగదు లేక పూజలకు టిక్కెట్లను కొనుగోలు చేయడం విరమించుకుంటున్నారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగానే ఏటీఎం లావాదేవీలకు ఇబ్బందులు కలుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ నెట్వర్క్ ల సమస్య వల్లనే ఏటీఎంల సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని తెలియవస్తోంది.






