- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం కేసు విచారణ ముమ్మరం.. హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీలో మద్యం కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో మద్యం కేసు(Liquor Case) విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వైసీపీ(Ycp) నేతలు వరుసగా జైలు(Jail)కు పోతున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి(Mp Mithun Reddy) సహా మరో 11 మంది రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్నారు. అయితే ఈ కేసులన్నీ అక్రమం అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే తప్పు చేసిన ఎవరికైనా శిక్ష తప్పదని టీడీపీ(Tdp) నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత(Home Minister Anita) కూడా ఈ కేసులో ఎవరూ తప్పించుకోలేరనే కామెంట్స్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా అసరవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత లిక్కర్ స్కామ్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితులు ఎవరు ఉన్నా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. దర్యాప్తులో ఆధారాలు దొరికిన వాళ్లను ఇప్పటికే రిమాండ్ కు తరలించామని చెప్పారు. ప్రస్తుతం మద్యం కేసులో విచారణ ముమ్మరంగా జరుగుతోందని హోంమంత్రి అనిత వెల్లడించారు. అయితే వైసీపీ అధినేత జగన్‌ను లిక్కర్ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ నేపథ్యంలో హోంమంత్రి అనిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో చూడాలి.






