భారీ అగ్నిప్రమాదం.. పండగవేళ నిరాశ్రయులైన 120 మంది

by Vemula.Srinu Prasad |

గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంతో పండగ వేళ 120 మంది నిరాశ్రయులయ్యారు...

భారీ అగ్నిప్రమాదం.. పండగవేళ నిరాశ్రయులైన 120 మంది
X

దిశ, వెబ్ డెస్క్: పండగ వేళ 120 మంది నిరాశ్రయులయ్యారు. మొత్తం 38 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన కాకినాడ జిల్లా(Kakinada District) రౌతులపూడి మండలం(Routulapudi Mandal) సార్లంక(Sarlanka)లో జరిగింది. గ్రామంలో మూడు ఇళ్లు మినహా అని పూరిగెడిసెలు అగ్నికి ఆహుతయ్యారు. సంక్రాంతి నేపథ్యంలో కొనుగోళ్ల కోసం గ్రామస్తులు తునికి వెళ్లారు. ఈ సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే గ్రామంలో ఉన్న కొందరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కాకపోతే తుని నుంచి ఫైరింజన్లు రావడానికి చాలా సమయం పట్టింది. ఈలోపు పూరిళ్లు మొత్తం దగ్ధమయ్యాయి. షార్ట్ సర్య్కూట్ కావడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని, ఆ సమయంలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఇంత ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు ముమ్మరం చేశారు.

Next Story