- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుల్లటి పండ్లు తింటున్న మాధురి...దువ్వాడకు వారసుడు వస్తున్నాడా..?
వైసీపీ పార్టీ ( YCP) నాయకులు దువ్వాడ శ్రీనివాస్ ( Duvvada Srinivas) తండ్రి కాబోతున్నాడా? అసలు దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ పార్టీ ( YCP) నాయకులు దువ్వాడ శ్రీనివాస్ ( Duvvada Srinivas) తండ్రి కాబోతున్నాడా? అసలు దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఏం జరుగుతోంది..? పుల్లటి మామిడి కాయలు తింటూ దివ్వెల మాధురి ( divvela madhuri ) వీడియో పెట్టడం వెనుక కారణాలేంటి ? ఇప్పుడు ఈ ప్రశ్నలన్ని... పెద్ద తలనొప్పిగా మారాయి. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే... దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు మాధురి... నిత్యం తాను ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో పెడుతుంది.
ఈ నేపథ్యంలోనే... వాళ్ల తోటలో పెరిగిన పుల్లటి మామిడి కాయలను...హార్వెస్ట్ చేసిన వీడియోను... తన అభిమానుల కోసం పంచుకుంది మాధురి. మూడు పెద్ద మామిడికాయలను ( Mangos) తెంపి... సిగ్గుపడుతూ ఈ వీడియోలో కనిపించింది మాధురి. ఈ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో... ఈ వీడియో కింద నెటిజెన్స్ చాలా రకాల కామెంట్స్ పెడుతున్నారు. కంగ్రాట్స్ దువ్వాడ శ్రీనివాస్ అంటూ కొంత మంది కామెంట్స్ పెడుతుంటే... దువ్వాడ శ్రీనివాస్ కు వారసుడు వస్తున్నాడని మరికొంత మంది.. పోస్టులు పెడుతున్నారు. బుడ్డ శ్రీనివాస్.. వస్తున్నాడంటూ మరికొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు.
వాస్తవానికి ఈ మధ్యకాలంలో చాలా ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు మాధురి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలలో దువ్వాడ శ్రీనివాస్ కు వారసుడుని.. ఇస్తానంటూ మాధురి పదేపదే పేర్కొంది. ఇలాంటి తరుణంలోనే మాధురి ( divvela madhuri) పుల్లటి మామిడికాయలతో కనిపించడం.. కొత్త అనుమానాలకు తావు ఇస్తోంది. నిజంగానే మాధురి తల్లి కాబోతుందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.






